బంగారం పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. అదేంటో బంగారం ధరలు అసలు స్థిరంగా లేవు.. ఒక రోజు బంగారం భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం.. ఈ మధ్యకాలంలో మరి దారుణంగా తయారు అయ్యింది. 

 

అయితే ఒకసారి 20 రూపాయిలు బంగారం తగ్గితే మరుసటి రోజు 200 రూపాయిలు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిల తగ్గుదలతో 42,180 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయిల తగ్గుదలతో 38,720 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర అంతకు మించి తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 60 రూపాయిలు తగ్గుదలతో 49,600 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: