బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక. బ్యాంకులకు వరుసగా రేప‌టి నుంచి మూడురోజుల పాటు సెలవులు రాబోతున్నాయి. పండగలు లేకుండా సెలవులు ఏమిటని అనుకోవద్దు. వేతన సవరణను డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో సమ్మె బాట పట్టనున్నారు. ఇక 2 వ తేదీ ఆదివారం. అందుకే మూడురోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.  ఈ విషయాన్ని యునైటెడ్‌ ఫోరం ఫర్‌ బ్యాంకు యూనియన్స్‌ నేతలు తెలిపారు. 

 

బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని, ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకరించ లేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు. ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి, సేవలందిస్తున్నా, తమను పట్టించుకోకుండా, డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్ నాయకులు ఆరోపించారు.

 

దీంతో వేతన సవరణకు డిమాండ్.. తక్షణ వేతన సవరణను డిమాండ్ చేస్తూ తొమ్మిది బ్యాంకు యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో వివిధ యూనియన్లు పాల్గొంటున్నాయి. అలాగే ఈ రెండు రోజుల సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుంటే.. మార్చి 11 నుంచి మ‌రో మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. సో.. బ్యాంక్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఏమైనా బ్యాంక్ ప‌నులు ఉంటే ఈ రోజు లేదా మ‌రో మూడు రోజుల త‌ర్వాత అంటే సోమ‌వారం చూసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: