టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డీటీహెచ్ టారిఫ్ లో కొత్త మార్పులు జరపనున్నట్లు ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన కొత్త రూల్స్ కూడా మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి కొత్త టారిఫ్ లను జనవరి 15వ తేదీ నాటికే విడుదల చేయాలిసి ఉండగా ట్రాయ్ బ్రాడ్ కాస్టర్లకు సూచించింది. అయితే బ్రాడ్ కాస్టర్లు ఈ అంశంపైన స్థానిక కోర్టులను ఆశ్రయించాయి. దీనిపై ఇప్పటికే పలు వాయిదాలు జరిగగా తర్వాతి వాయిదా ఫిబ్రవరి 12వ తేదీన జరగనుంది. అసలు ఫిబ్రవరి 12వ తేదీన ఏం కానుంది? అసలు బ్రాడ్ కాస్ట్ కంపెనీలు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాయి? మొత్తానికి టీవీ చానెల్ ధరలు తగ్గనున్నాయా..? లేక పెరగనున్నాయా..? అనేది ఇప్పుడు తెలుసుకుందాము.

 

 

ట్రాయ్ NTO 2.0 పేరిట జరగాల్సిన ఈ సవరణ 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికే అమల్లోకి రావాల్సి ఉంది. బ్రాడ్ కాస్టర్లు తమ కొత్త టారిఫ్ ప్లాన్లను జనవరి 15వ తేదీ నాటికే తెలియాల్సి ఉంది. అయితే ట్రాయ్ కొత్త నిబంధనలపై స్టే విధించాలని బ్రాడ్ కాస్టర్లు స్థానిక కోర్టులను కోరగా కోర్టు దీనిపై విచారణను ఫిబ్రవరి 12వ తేదీ నాటికి వాయిదా వేసింది.

 

 

అయితే ఒకవేళ కోర్టు తీర్పు ట్రాయ్ కు అనుకూలంగా వస్తే బ్రాడ్ కాస్టర్లు ట్రాయ్ తెలిపిన ధరల ప్రకారం కొత్త ధరలను చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ కోర్టు తీర్పు బ్రాడ్ కాస్టర్లకు అనుకూలంగా వచ్చినప్పటికీ దీనికి సంబంధించిన అమలు కావడానికి ఒక నెల రోజులు వాయిదా పడుతుంది. సాధారణంగా బ్రాడ్ కాస్టర్లు కొత్త చార్జీలను నిర్ణయించిన అనంతరం వాటిని అమల్లోకి తీసుకురావడానికి ఒక నెల రోజుల గడువును పెంచుతారు.

 

 

కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ లు తమ కొత్త ప్లాన్లను ఫిబ్రవరి 12వ తేదీనే తెలిపే అవకాశం లేకపోలేదు. డీటీహెచ్ ఆపరేటర్లతో పాటు కేబుల్ టీవీ కూడా టారిఫ్ ల ప్రకటన కూడా అదే రోజున తెలిసే ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: