చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన కరోనా  వైరస్ ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. అయితే చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి చైనాలో ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఏకంగా ఏడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 34 వేల మందికి పైగా ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని ఈ ప్రాణాంతకమైన వైరస్తో బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే వివిధ దేశాలు చైనా కు వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేసుకున్నారు. ఆయా దేశాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడుతున్నారు. 

 

 

 అటు చైనా ప్రభుత్వం కూడా కరోనా  బాధితులను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ఈ ప్రాణాంతకమైన వైరస్ కేవలం ప్రాణనష్టం కలిగించడమే కాదు ఆర్థిక నష్టాన్ని కూడా ఎంతగానో కలిగిస్తోంది. ప్రస్తుతం చైనా లోని ఏ వ్యాపార సంస్థ కూడా తమ బ్రాంచీలను నిర్వహించడం లేదు. అంతే కాకుండా ఎన్నో సర్వీసులు కూడా రద్దు అయిపోయాయి. బాహ్య ప్రపంచం నుంచి చైనాకు రవాణా సహా పలు సదుపాయాలను కూడా ఆయా దేశాలు నిలుపు వేస్తున్న  నేపథ్యంలో అటు చైనా కు భారీ మొత్తంలోనే ఆర్ధిక నష్టం కూడా జరుగుతుంది. 


 అయితే ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుంది. ఈ ప్రాణాంతకమైన వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతుండటంతో  స్టాక్ మార్కెట్లు నష్టాలను బాటపట్టాయి.  మదుపుదారులు అమ్మకాలకు దిగడంతో మెటల్ ఆటోమొబైల్ సహా కీలక సూచీలు పతనమై పోయాయి. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జిసి, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్ట పోతుండగా
.. హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ క్రమక్రమంగా పడుతూ వస్తున్నాయి. మొత్తం బిఎస్ఇ  సెన్సెక్స్  235 పాయింట్ల నష్టంతో 40, 906 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది... 69 పాయింటు కోల్పోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12029 పాయింట్ల వద్ద ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: