దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐ నో యువర్ కస్టమర్(కేవైసీ)కు సంబంధించిన ఒక పబ్లిక్ నోటీస్ ను జారీ చేసింది. ఈ నోటీస్ లో ఎస్బీఐ ఖాతాదారులందరూ కేవైసీ ప్రక్రియను ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని కోరింది. ఫిబ్రవరి 28వ తేదీలోపు కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తామని ఎస్బీఐ హెచ్చరించింది. 
 
ఖాతాదారులు కేవైసీ పూర్తి చేసుకుంటే బ్యాంకింగ్ సేవలను నిరంతరాయంగా పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీలోపు కేవైసీ పూర్తి కాకపోతే అకౌంట్లు బ్లాక్ చేఅయడం తప్ప తమకు మరొక ఆప్షన్ లేదని ఎస్బీఐ పేర్కొంది. ఇప్పటికే ఎస్బీఐ కేవైసీ పూర్తి చేసుకోని ఖాతాదారులకు ఈ మెయిల్, మెసేజ్ ల ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవాలని సందేశాలు పంపుతోంది. కేవైసీ పూర్తి చేసుకోవడానికి కేవలం 7రోజులే సమయం ఉంది కాబట్టి ఎస్బీఐ ఖాతాదారులు వెంటనే కేవైసీ పూర్తి చేసుకుంటే మంచిది. 
 
మన దేశంలోని బ్యాంకులు మనీ లాండరింగ్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలు అనుసరించి కస్టమర్ల కైవైసీ ప్రక్రియను పూర్తి చేయించాలి. ఆర్బీఐ కూడా దేశంలోని అన్ని బ్యాంకులు కస్టమర్ల కేవైసీ అప్ డేట్ చేయించాలని పేర్కొంది. ఇప్పటివరకూ కేవైసీ పూర్తి చేసుకోని కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించి కేవైసీ వివరాలను అప్ డేట్ చేసుకోవాలి. 
 
ఫిబ్రవరి 28వ తేదీలోపు అప్ డేట్ చేసుకోకపోతే బ్యాంక్ అకౌంట్ నుండి ఎలాంటి సేవలు పొందటం వీలు కాదు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కేవైసీ అప్ డేట్ చేయించుకోవాలనుకునేవారు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్సులతో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: