3 ఏళ్ళ క్రితం పేదవాడి నుండి ఉన్నవాడి వరుకు అందరిని టెన్షన్ కు గురిచేసి మరి రెండు వేల రూపాయిల నోటును తీసుకువచ్చింది మోడీ సర్కార్. అలాంటిది ఇప్పుడు ఆ రెండు వేల నోటు త్వరలోనే బ్యాన్ కానుంది అని ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. అయితే చివరికి ఆ రూమర్స్ నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. 

 

ఇటీవల కేంద్రం కూడా 2 వేల నోటును రద్దు చేస్తుంది అని వార్తలు వినిపించాయి. అయితే నకిలీ 2 వేల నోట్లు భారీగా చెలామణిలోలో వచ్చాయని నివేదికలో పేర్కొన్నారు కూడా.. అయితే ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది అని వార్తలు రాగా ఇప్పుడు తాజాగా బ్యాంకులపై వార్తలు వస్తున్నాయి. 

 

ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు 2 వేల నోట్ల చెలామణిని నియంత్రించనుంది అని వార్తలు వచ్చాయి.. అయితే ఆ బ్యాంకు అధికారులకు 2వేల నోటుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని నివేదికలు వచ్చాయి. ఖాతాదారుల్లో గందరగోళం తలెత్తకుండా వారి నుండి ఎప్పటిలగే 2వేల నోటు తీసుకొని వాటిని మళ్లీ తిరిగి ఇవ్వొద్దు అని బ్యాంకు అధికారులకు చెప్పినట్టు సమాచారం. 

 

అయితే ఇన్నాళ్లు వచ్చిన రూమర్లే చివరికి నిజం అయ్యాయి.. ప్రభుత్వ రంగానికి చెంది ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో రూ.2,000 నోట్లను పెట్టవద్దని బ్యాంక్ వాటి బ్రాంచ్‌లకు తెలియజేసింది. మర్చి 1నుండి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అని చెప్పారు. అయితే 2వేల నోటు ఎందుకు వద్దు అని ప్రశ్నించగా కస్టమర్లకు 2వేల నోటు కారణంగా చిల్లర సమస్యలు వస్తున్నాయని ఇలా చేశామని బ్యాంకు పేర్కొంది. దీంతో ఏంటి ఈ చిల్లర సమాధానం అని బ్యాంకు ఖాతాదారులు విరుచుకుపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: