2016 నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లు రూ.500, 1000నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రద్దయిన పాత నోట్ల స్థానంలో కొత్తగా రూ.2వేలు, రూ.500 నోట్లను తీసుకొచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా రూ.2వేల నోట్లు త్వరలో రద్దు అవుతాయంటూ వ‌స్తున్న వార్తలకు చెక్ పడింది. ఈ నోట్లను రద్దు చేసే ఆలోచన లేని bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త డిజైన్‌తో ఆ నోట్లను తీసుకొస్తుంది. మహాత్మాగాంధీ బొమ్మతో ముస్తాబవుతోన్న ఈ నోట్‌ కలర్, సైజ్, థీమ్ అన్నింటిలోనూ మార్పులు ఉండబోతున్నాయి. 

 

ఇక 66mm x 166mm సైజ్‌తో రాబోతున్న ఈ కొత్త నోట్ల గురించి కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ముందుగా రూ.2వేల నోట్ ప్రత్యేకత‌లు చూస్తే..  మహాత్మాగాంధీ బొమ్మ పక్కన ఆర్బీఐ, 2వేల అక్షరాలు ఉంటాయి. అయితే మైక్రోస్కోప్‌లో మాత్రమే వాటిని చూడగలం. లైట్‌లో పెట్టినప్పుడు నోటుకు పూర్తి ఎడమ భాగంలో రెండు వేల నంబర్ గుర్తు కనిపిస్తుంది. రెండు వేలు అన్న నంబర్ దేవనాగరి లిపిలో కరెన్సీ నోటుకు ఎడమ భాగంలో ఉండబోతోంది. నోటును మన కంటి లెవల్ నుంచి 45డిగ్రీల కోణంలో మడిచినప్పుడు రెండు వేల నంబర్ కనిపించనుంది.

 

నోటు మీద కుడి భాగంలో ప్రింట్ అయిన న్యూమరికల్ కలర్ గ్రీన్ నుంచి బ్లూకు మారనుంది. గ్యారేంటీ క్లాజ్ సెక్షన్‌లో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉండబోతోంది. నోటును అటు ఇటూ తిప్పుతూ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ బొమ్మ కలర్ బ్లూ నుంచి గ్రీన్‌లా మారనుంది. కరెన్సీ నోటు వెనుక భాగం కిందలో స్వచ్ భారత్ నినాదం ఉండనుంది. నోటుకు రెండు వైపులా ఏడు యాంగులర్ లైన్లు ఉండబోతున్నాయి. అంధులు నకిలీ నోట్లను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి.

 

ఇక రూ. 500 నోట్ ప్ర‌త్యేక‌త‌లు చూస్తే..మహాత్మాగాంధీ బొమ్మ పక్కన ఆర్బీఐ భారత్ ఇండియా అక్షరాలు ఉంటాయి. అయితే మైక్రోస్కోప్‌లో మాత్రమే వాటిని చూడగలం. నోటును మన కంటి లెవల్ నుంచి 45డిగ్రీల కోణంలో మడిచినప్పుడు 500 నంబర్ కనిపించనుంది. లైట్‌లో పెట్టినప్పుడు నోటుకు పూర్తి ఎడమ భాగంలో 500 నంబర్ గుర్తు కనినిస్తుంది. నోటును అటు ఇటూ తిప్పుతూ ఉన్నప్పుడు మహాత్మా గాంధీ బొమ్మ కలర్ బ్లూ నుంచి గ్రీన్‌లా మారనుంది. గ్యారేంటీ క్లాజ్ సెక్షన్‌లో ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉండబోతోంది.

 

నోటుకు పూర్తి కుడివైపున అశోక చక్రం ఉండబోతోంది. నోటుకు రెండు వైపులా ఐదు యాంగులర్ లైన్లు ఉండబోతున్నాయి. ఐదు వందలు అన్న నంబర్ నోటుకు సమాంతరంగా ఓ వృత్తాకారంలో ఉండబోతోంది. నోటు మీద కుడి భాగంలో ప్రింట్ అయిన న్యూమరికల్ కలర్ గ్రీన్ నుంచి బ్లూకు మారనుంది. కరెన్సీ నోటు వెనుక భాగంలో ఆ నోటును ముద్రించిన సంవత్సరం ఉండబోతోంది. నోటు వెనుక భాగం పైన కూడా దేవనాగరి లిపిలో నోటు విలువ ఉండబోతోంది. కరెన్సీ నోటు వెనుక భాగంలో ఇస్రో మార్స్ మిషన్ గుర్తు ఉండబోతోంది.
  

మరింత సమాచారం తెలుసుకోండి: