నిన్ననే చెప్పా కదా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇక రోజు పెరుగుతాయి అని.. ఆలా చెప్పినట్టే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.. అవును.. మీరు షాక్ అవ్వచ్చు.. ఆలా ఎలా పెరిగాయి అని.. కానీ రెండు రోజుల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగటం ప్రారంభించాయి. ఆశ్చర్యం వేసినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం సర్వ సాధారణం అయిపోయింది. 

 

ఇకపోతే నేడు పెట్రోల్, డీజిలు ధరలు ఎలా పెరిగాయి అంటే?  నేడు హైదరాబాద్ మార్కెట్ లో లీటర్ పెట్రోల్ ధర 7 పైసలు పెరుగుదలతో రూ.76.52 వద్దకు చేరగా, డీజిల్ ధర 6 పైసలు పెరుగుదలతో రూ.70.48కు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా పెరిగాయి. 

 

ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అమరావతిలో 10 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర 76.64 రూపాయలకు దగ్గరకు చేరగా, డీజిల్ ధర కూడా 13 పైసలు పెరుగుదలతో 71.47 వద్దకు చేరుకుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 76.90 రూపాయలకు చేరగా.. డీజిల్ ధర కూడా 5 పైసలు పెరుగుదలతో 70.91పైసల్ వద్దకు చేరింది.  

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే  కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.72 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 65.80 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. మరి పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: