బంగారం ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేవలం సంవత్సరం అంటే సంవత్సరంలో బంగారం ధర 10 వేలు పెరిగింది. సామాన్యులు ఆ బంగారాన్ని చూసి బాబోయ్.. ఇక ఈ బంగారం కూడా మనకు సంబంధం లేదు.. మనం దాన్ని కొనలేము అని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు.. ఎందకంటే? బంగారం అంత పెరిగింది. 

 

ఇక పోతే.. నిన్నటికి నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు ఒక్కసారిగా పడిపోయింది.. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే? ఐదు రోజుల్లో మూడు వేలు రూపాయిలు పెరిగింది.. కానీ నేడు తగ్గింది ఎంత అంటే? 1,200 రూపాయిలు తగ్గింది. అంటే 1800 అలాగే పెరిగే ఉంది.. కానీ 12 వందలు తగ్గటం కూడా గ్రేట్ అనే చెప్పాలి. 

 

ఎందుకంటే? ఒకసారి పెరిగిన బంగారం ధర ఎంత చేసిన తగ్గదు.. అలాంటిది ఇప్పుడు తగ్గటం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక పోతే.. భారత్‌ ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,200 తగ్గుదలతో రూ.42,371కె క్షీణించింది. ఇక బంగారం ధర ఇలా భారీగా తగ్గితే వెండి ధర కూడా అలాగే భారీగా క్షిణించింది. 

 

కేజీ వెండి ధర ఏకంగా 3 వేల రూపాయిలు తగ్గి వావ్ అనిపించింది. మూడు వేలు తగ్గుదలతో కేజీ వెండి ధర 51వెయ్యి నుండి 48 వేలకు చేరింది. అయితే బంగారం.. వెండి ధరలు ఇలా భారీగా తగ్గటానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ భారీగా పడిపోయింది అని అందుకే బంగారం ధర ఇలా క్షిణించింది అని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: