ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన పథకాలు అందిస్తుంది.. ఆడపిల్లలు, చిన్నపిల్లలు , మహిళలు,  సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో మంచి మంచి పథకాలు అందిస్తుంది.. అలా అందించిన పథకాలలో అటల్ పెన్షన్ యోజన ఒకటి.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ ఒకటి. 

 

అటల్ పెన్షన్ యోజన, ఎన్‌పీఎస్ వంటి పథకాల్లో లాభాలు తెలుసుకొని అందులో చేరే వారు ఎక్కువ అయిపోయారు.. ఎందుకంటే వాటి లాభాలు అలా ఉంటున్నాయి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నెల చివరి కల్లా ఈ రెండు పథకాల్లో కొత్తగా చేరే వారి సంఖ్య  దాదాపు 10 నుండి 12 లక్షలు వరుకు ఉండనుంది. 

 

నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ స్కీమ్‌లో చేరడం వల్ల అదనపు పన్ను తగ్గింపు బెనిఫిట్స్ పొందొచ్చు. ఆదాయపు పన్ను ట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందుతారు. అయితే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరడం వల్ల దీనికి అదనంగా మరో రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు తక్కువ ప్రీమియంతోనే మంచి పెన్షన్ ఈ స్కిమ్ ద్వారా పొందొచ్చు. ఇక అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తో కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: