అవును.. రెండు రోజుల తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. మూడు రోజుల క్రితం బంగారం ధర మూడు వేలు పెరిగి ఆకాశాన్ని తాకింది.. రెండు రోజుల క్రితం 12 వందలు తగ్గి ఆహా అనిపించింది.. ఇక తగ్గుతుందిలే.. బంగారం ధర ఒక్కసారి తగ్గుముఖం పట్టింది అంటే వారం రోజులు తగ్గుతూనే ఉంటుందిలే అని అందరూ అనుకున్నారు.. కానీ అలా అవ్వలేదు. 

 

బంగారం ధర తగ్గేదే లేదు అన్నట్టు పెరిగిపోయింది. దీంతో ఇక బంగారంను మనం కొనలేములే.. బంగారాన్ని బ్యాన్ చేసి పడేస్తే సరిపోతుంది అని సామాన్యులకు అనిపించేలా బంగారం ధర పెరిగింది.. మరి ఈ బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? అసలు తగ్గుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. 

 

ఇకపోతే బంగారం ధర ఈరోజు ఎంత పెరిగింది అనేది చుడండి.. వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిల పెరుగుదలతో 44,550 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 210 రూపాయిల పెరుగుదలతో 40,820 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కాస్త తగ్గింది.. దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిల తగ్గుదలతో 49,600కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ఇలాగే కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: