వాహనదారులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా.. తగ్గకుండా గత మూడు రోజుల నుండి స్థిరంగా కొనసాగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి.. అవును.. నిజంగానే భారీగా తగ్గాయి. ఆ పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. అలా తగ్గాయి.  

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు శనివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 7 పైసలు తగ్గుదలతో 76.47 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో 70.37 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.71.84 వద్ద, డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.64.82కు చేరింది. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా నెల రోజుల్లో పెట్రోల్, డీజిల్ పై ఐదు రూపాయిలు తగ్గింది అంటే వాహనదారులకు శుభవార్తే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: