అంతేకదా మరి. బంగారం ధర ఎంత ఉండాలి? అహ.. మహా అయితే బంగారం ధరలు ఎంత ఉండాలి చెప్పండి. సంవత్సరం అంత పెరిగిన సరే బంగారం ధర 33 వేలో.. లేదా 34 వేలో ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 44వేలు ఉంది ? అంటే బంగారం ధర ఎంత పెరిగినట్టు? ఏకంగా 10 వేలు పెరిగింది. 

 

అంత పెరిగిన హై క్లాస్ వాళ్ళు అయితే కొనగలరు కానీ.. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలరా? అసలు బంగారంను చూడగలరా? బంగారం ధర ప్రస్తుతం సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంది. ఎలా చుసిన సరే సామాన్యులు బంగారాన్ని ఏమాత్రం కొనలేరు. ఎందుకంటే బంగారం ధరలు అంత పెరిగాయి. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పుడు కాస్త తగ్గాయి అనుకోండి. 

 

ఈ నేపథ్యంలో వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిల తగ్గుదలతో 44,410 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయిల తగ్గుదలతో 40,710 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 30 రూపాయిల తగ్గుదలతో 49,570 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: