మార్చి నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. సాధారణ, పండగ సెలవులకు బ్యాంకు యూనియన్ల సమ్మె కూడా తోడవడంతో దాదాపు సగం రోజులు కస్టమర్లకు బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు. తరచూ లావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లేవారికి సెలవుల వల్ల ఇబ్బందులు తప్పవు. ఖాతాదారులు పని దినాల వివరాలు తెలుసుకొని ముందుగానే లావాదేవీలను చేసుకోవడం ఉత్తమం. 
 
కేవలం 19 రోజుల పాటే మార్చిలో బ్యాంకులు పని చేయనునున్నాయి. మార్చి 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు బ్యాంకు యూనియన్ల సమ్మె జరగనుంది. యూనియన్లు సమ్మెలోకి వెళ్లకపోతే మాత్రం 9 రోజులు బ్యాంకింగ్ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు. మార్చి 1 ఆదివారం కావడంతో తొలి తోజుతోనే బ్యాంకు సెలవు దినం మొదలవుతుంది. మార్చి నెలలో 1, 8, 15, 22, 29 ఆదివారాలు కావడంతో బ్యాంకులు పని చేయవు. 
 
మార్చి 14, 28 ఉద్యోగులకు వీక్లీ ఆఫ్ కారణంగా బ్యాంకులు అందుబాటులో ఉండవు. మార్చి 10న హోలీ, మార్చి 25న ఉగాది పండుగ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు తెరుచుకోవు. బ్యాంక్ యూనియన్ల సమ్మె గురించి మార్చి 5వ తేదీన కేంద్ర లేబర్ కమిషనర్ దగ్గర జరిగే చర్చల్లో స్పష్టత రానుంది. 5వ తేదీన మార్చి 11 నుండి 13 వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయా...? లేదా..? తేలనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: