మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్. వంట గ్యాస్ ధర భారీగా తగ్గింది. గత కొన్ని నెలలుగా వంట గ్యాస్ ధర పెరుగుతూ ఉండటంతో వినియోగదారులపై అదనపు భారం పెరిగింది. ఈ నెల నుండి సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆరు నెలలుగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ నెల ఉపశమనం కలిగింది. ముంబై, ఢిల్లీలలో సబ్సిడీ లేని వంట గ్యాస్ ధర 53 రూపాయలు తగ్గింది. 
 
ఇతర రాష్ట్రాలలో కూడా ఇంచుమించు సబ్సిడీ లేని వంట గ్యాస్ ధర 50 రూపాయలు తగ్గింది. వినియోగదారులు వంటగ్యాస్ ధరలు తగ్గినా పెద్దగా ఆనందపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ఆరు నెలలలో పెరిగిన మొత్తంతో పోల్చి చూస్తే తగ్గింది చాలా తక్కువ. అందువలన రేట్లు తగ్గినా వినియోగదారులపై భారం మాత్రం పెద్దగా తగ్గలేదు. ముంబైలో గ్యాస్ బండ ధర రూ.776.5 ఉండగా ఢిల్లీలో ధర రూ. 805.5 గా ఉంది. 
 
ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. ఒకటో తేదీన సిలిండర్ ధర పెరగొచ్చు... లేదా తగ్గొచ్చు.. కేంద్రం ప్రస్తుతం ప్రతి కుటుంబానికి సబ్సిడీ కింద 12 సిలిండర్లను అందిస్తోంది. వీటికి అదనంగా సిలిండర్ కావాలనుకున్న వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించాలి. ప్రతి నెలా ఎల్పీజీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సమీక్షిస్తూ ఉంటాయి. డాలర్ - ఇండియన్ మారకపు విలువ, అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ రేట్లు అంశాల ప్రాతిపదికన ధరలు మారుతూ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: