సామాన్యుడికి ఇక పసిడి అందని ద్రాక్షగానే మిగిలే అవకాశముంది . బంగారం ధరలు నాలుగురోజుల తరువాత మళ్ళీ పెరిగాయి . 10 గ్రాముల బంగారం ధర 593  రూపాయలు పెరిగి 41 , 829 రూపాయలకు చేరింది . బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్ లో 1 .42 శాతం పెరగ్గా , అటు ప్రపంచ మార్కెట్ లోను పెరుగుదల బాట పట్టాయి . అంతర్జాతీయ మార్కెట్ లో శనివారం ముగుంపు ధరలతో పోలిస్తే , బంగారం ధర 18 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం ధర 1 , 603 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతోంది .

 

రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి . ఈ నేపధ్యం లో సామాన్యుడు అతిగా ఇష్టపడే పసిడి కొనుగోలు అన్నది  ఇక  రానున్న రోజుల్లో మరింత ప్రియం కానుంది . అంతర్జాతీయ మార్కెట్ లో బంగారానికి ఉన్న డిమాండ్ వల్లే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు . రానున్న 12 నెలల వ్యవధిలో  ఔన్స్ బంగారం ధరలు 1 , 800 డాలర్లకు చేరే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు . అదే జరిగితే భారత్ లో పది గ్రాముల  బంగారం ధర 50 వేల వరకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు .

 

ప్రస్తుతం శుభ కార్యాల సీజన్ ప్రారంభం కానున్న నేపధ్యం లో సామాన్యులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని , ఈ తరుణం లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్యులకు ఆర్ధిక ఇబ్బందులు తప్పకపోవచ్చునని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . శుభ కార్యాలకు ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేయడమన్నది సగటు మధ్యతరగతి ప్రజల్లో ఆనవాయితీగా వస్తోందని , ధరలు ఎంత పెరిగిన ఎంతోకొంత కొనుగోలు చేస్తుంటారని చెప్పారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: