మన భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలంటి ఈ బంగారంను ప్రస్తుతం మన భారతీయులు కొనలేని స్థితికి చేరుకున్నారు. ఎందుకంటే బంగారం ధర తారాస్థాయికి చేరుకుంది కనుక. అందుకే బంగారంను అసలు కొనలేక పోతున్నారు. ఇకపోతే తగ్గుతూ.. పెరుగుతూ ఉన్న బంగారం ధర కరోనా కారణంగా త్వరలోనే భారీగా తగ్గనుంది. కానీ ఈరోజు మాత్రం పెరిగింది అనే చెప్పాలి. 

 

ఈ నేపథ్యంలోనే నేడు సోమవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిల పెరుగుదలతో 43,780 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయిల పెరుగుదలతో 39,980 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అదే రేంజ్ లో పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 250 రూపాయిల పెరుగుదలతో 48,750 రూపాయిలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: