పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యం పెరుగుతున్న వాహనాల సంఖ్య‌తో పాటు వాటికి తోడు పెట్రోల్, డీజ‌ల్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతొంది. దీంతో ఆయిల్ ధ‌ర‌లు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఇలా రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి ఆరని మంటల్ని రగిలిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇక‌పై  బండి న‌డ‌వాలంటే లీటర్ పెట్రోల్ ఉండాల్సిందే అన్న ప‌రిస్థితి త్వ‌ర‌లోనే రానుంది. ఎందుకంటే.. దీనికి త‌గ్గ‌ట్టుగా  BS-6 మోడల్స్‌లో కొన్ని మార్పులు చేశారు. 

 

దీంతో వ్యూయల్ ట్యాంక్ నుండి నేరుగా పెట్రోల్, డీజిల్ చేరేలా ఏర్పాటు చేశారు. వాస్త‌వానికి గతంలో బండిలో పెట్రోల్ అయిపోయినా ప్యూజ్  ఇచ్చి బండి నడిపేవారు. కానీ కొత్త మోడల్స్‌లో అలా చేయ‌డం సాధ్యం కాదు. బండి న‌డ‌వాలంటే ఖ‌చ్చితంగా లీట‌ర్ పెట్రోల్ ఉండాల్సిందే. మ‌రి ఈ మార్పుల‌తో సామాన్యుడి ప‌రిస్థితి ఏంటి అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌రోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం స్థాయి అత్యంత ప్రమాదకర స్థితిలోకి పడిపోయింది. ఢిల్లీలో వాతావరణం విషపూరితంగా మారింది. గత కొన్నిరోజులుగా నగరం మొత్తం దట్టంగా పొగమంచు అలుముకుంది. 

 

దీంతో.. కాలుష్యంను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ప్ర‌ధాన కారణం.. పెట్రోల్, డీజిల్లో ఉండే 50 శాతం సల్ఫర్‌నే. ఈ సల్ఫర్ ఇంజన్‌లో మండి పొగ రూపంలో బయటకు వస్తుంది. ఇక అందులోనూ బీఎస్4 వాహనల్లో వచ్చే పొగ మరింత ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై శుద్ధి చేసిన డీజిల్, పెట్రోల్‌ని సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇక BS-6 వాహనాల్లో ఆ సౌకర్యం ఉండ‌దు. కాబ‌ట్టి.. బండి న‌డ‌వాలంటే ఖ‌చ్చితంగా లీట‌ర్ పెట్రోల్ ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: