గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకు ఈ పెట్రోల్, డీజిల్ భారీగా తగ్గుతున్నాయి. గత రెండు నెలలో దాదాపు 6 రూపాయిలు తగ్గింది. ఇంకా ఈ నేపథ్యంలోనే గత వారం పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా కొనసాగిన ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. 

 

నేడు ఆదివారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 20పైసలు తగ్గుదలతో 75.29 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 19 పైసలు తగ్గుదలతో 69.15 రూపాయిల వద్దకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.71.09 వద్ద, డీజిల్ ధర రూ.64.08 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఆర్ధిక రాజధాని అయినా ముంబైలోను పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే భారీగా తగ్గాయి. పెట్రోల్ ధర 12 పైసలు తగ్గుదలతో రూ.77.60 వద్దకు చేరాయి. డీజిల్ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.67.88కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ పై ఆరు రూపాయిలు తగ్గాయి. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం మంచి శుభవార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: