బంగారం ధరలు ఒక రోజు భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే మరి దారుణంగా పెరుగుతున్నాయి. అప్పట్లో కేవలం వందలు మాత్రమే ఉండేది.. ఇప్పుడు ఏకంగా వేలు వేలు పెరుగుతుంది. ఆ బంగారం ధరలు చూస్తే బాబోయ్.. ఏంటి ఇంత పెరిగింది అని ఒక్కసారిగా షాక్ అవుతారు. 

 

ఇక పోతే ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా తగ్గాయి. వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయిల తగ్గుదలతో 45,140 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 80 రూపాయిల తగ్గుదలతో 41,260 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 1,330 రూపాయిల తగ్గుదలతో 49,950 రూపాయిలకు చేరింది. కాగా అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతోనే బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: