కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.. ఎందుకు అని సందేహం రావచ్చు.. ఇక్కడే ఉంది అసలు చిక్కు. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయింది.. దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 

 

నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయిల పెరుగుదలతో 45,980 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 180 రూపాయిల పెరుగుదలతో 42,160 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 1,230 రూపాయిల తగ్గుదలతో 51,080 రూపాయిలకు చేరుకుంది. 

 

అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఈ బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏమైతేనేం.. చివరికి బంగారం సామాన్యులకు అందనంత ఎత్తులోకి చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: