మొన్న సోమవారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మాములు చుక్కలు చూపించలేదు.. ఒక్కసారిగా నష్టాలను తీసుకొచ్చి పెట్టింది. ఎన్నడూ లేని విధంగా స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 2450 పాయింట్స్ డౌన్ అయ్యింది.. ఇది అంత కూడా కరోనా వైరస్ కారణంగానే జరిగింది.. ఆరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యి.. నష్టాలతో ముగిశాయి.. 

 

అంతేకాదు... రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా ఏకంగా 15 శాతం పడిపోయి రికార్డు సృష్టించాయి.. ఇంకా చమురు ధరలు అయితే ఏకంగా 25 శాతానికి పడిపోయాయి అంటే నమ్మండి.. ఇంకా అలాంటి బ్లాక్ మండే మిగిల్చిన నష్టాల నుండి స్టాక్ మార్కెట్లు నేడు ఉదయం ఆరంభంలో కోలుకున్నప్పటికీ ఒడిదుడుకులతో స్టాక్ మార్కెట్ కొట్టు మిట్టాడుతుంది. 

 

ముడిచమురు ధరలు పుంజుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ భయాలు మాత్రం భారీగా వెంటాడుతున్నాయి.. అయితే ఈరోజు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌, భారతి ఎయిర్‌టెల్‌ షేర్లు ట్రేడ్ అవుతూ వస్తున్నాయి.. అంతేకాదు.. మొత్తం మేధా బీఎస్ఈ సెన్సెక్స్ పాయింట్లు నష్టంతో 35,566 పాయింట్ల వద్ద ట్రెండ్ అవుతుంది.. ఇంకా 36 పాయింట్ల నష్టంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,414 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది.. కాగా సాయింత్రానికి ఏమేరకు లాభాలు ఉంటాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: