కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు ఎలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక వారంలోనే బంగారం ధర నాలుగు వేలు పెరిగి రికార్డు సృష్టించింది. ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు మళ్లీ తగ్గటం ప్రారంభమయ్యాయి. ఈ తరహాలోనే ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

 

వివిధ మెట్రో నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో నేడు గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 280 రూపాయిల తగ్గుదలతో 45,700 రూపాయలకు చేరుకుంది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిల తగ్గిదలతో 41,840 రూపాయలకు చేరుకుంది. 

 

ఇంకా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేజీ వెండి ధర ఈరోజు 48,500 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక ఢిల్లీ మార్కెట్లోను ఇలాగే బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిల తగ్గుదలతో 43,900 రూపాయలకు చేరుకుంది. 

 

అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిల తగ్గిదలతో 42,700 రూపాయలకు చేరుకుంది. ఇంకా బంగారం ధరలు భారీగా తగ్గగా ఢిల్లీలో కూడా వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతుంది. ఇంకా విజయవాడ అమరావతిలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరలు ఎంత తగ్గిన ప్రస్తుతం సామాన్యులు కొనే స్థితిలో లేరు అనే చెప్పాలి.. ఎందుకంటే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి కాబట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: