మొన్న సోమవారం స్టాక్ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముడి చమురు ధరలు అయితే మరి దారుణంగా పడిపోయాయి.. ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ముడి చమురు ధరలు దాదాపు 28 శాతానికిపైగా తగ్గిపోవడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 36 డాలర్లు, అమెరికన్ డబ్ల్యుటీఐ ఆయిల్ బ్యారెల్ ధర 32 డాలర్లకు పడిపోయాయి.

 

దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి.. లీటర్ పెట్రోల్ ధరకు 25 పైసల చొప్పున తగ్గగా... లీటర్ డీజిల్ ధరకు 27 పైసలు తగ్గింది. దీంతో లీటర్ పెట్రోల్ ఇప్పుడే కేవలం 74 రూపాయిలు మాత్రమే. ఇంకా డీజిల్ కూడా 27 పైసలు తగ్గుదలతో 67.86కు చేరింది. ఇంకా ఢిల్లీలో అయితే ఏకంగా రెండు రూపాయిలు తగ్గింది. 

 

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినట్టు పలు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. కాగా ఇలా అంత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినప్పటికీ ఏప్రిల్ 1నుండి భారీగా పెరుగుతాయి అని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. కారణం బీఎస్ 6 నిబంధన. ఒక్క ఈ నిబంధన కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: