పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి అని ఊపిరి పీల్చుకునేలోపు కేంద్రం అదిరిపోయే షాక్ ఇచ్చింది. అంత అదిరిపోయే షాక్ ఏంటీ? అసలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటానికి కారణం కరోనా వైరస్ కదా! మళ్లీ ఈ కేంద్రం లొల్లి ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ! పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. 

 

లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించిన కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వాహనదారులకు షాక్ గురి చేస్తుంది.. 

 

ఇప్పటికే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేని విధంగా తగ్గుతున్నాయి అని అనుకున్న సమయంలో ఇలా పెరగటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొన్న మండే బ్లాక్ మార్కెట్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడెప్పుడో ఎన్నికల సమయంలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు అలా తగ్గటం.. కేంద్రం ఇలా పెంచడం.. సామాన్య ప్రజలతో ఓ రేంజ్ లో ఆట ఆడుతుంది కేంద్రం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: