ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తోన్న క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో అంత‌ర్జాతీయంగా అన్ని దేశాల మార్కెట్లు కుప్ప‌కూలుతున్నాయి. ఇప్ప‌టికే చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ అంతా కుప్ప‌కూలిపోయింది. చైనా దెబ్బ‌తో ఆ ప్ర‌భావం మిగిలిన ఆసియా దేశాల‌పై ఆ మార్కెట్లు కూడా కుప్ప‌కూలాయి. ఇక ద‌క్షిణ కొరియా, ఉత్త‌ర కొరియా మార్కెట్లు కూడా బాగా దెబ్బ‌తిన్నాయి. అక్క‌డ ఉత్ప‌త్తి రంగం ఢ‌మాల్ అయ్యింది. ఇక భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై సైతం ఈ ప్ర‌భావం ప‌డ‌డంతో మాన మార్కెట్లు గ‌త వారం రోజులుగా ఊగిస‌లాట ధోర‌ణిలో ఉన్నాయి.

 

ఇక క‌రోనా దెబ్బ‌తో బంగారం రేట్లు ఆకాశంలోనే ఉంటున్నాయి. క‌రోనా కోర‌లు చాస్తోన్న‌ క్రమంలో అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను తగ్గించడం బంగారాన్ని పరుగులు పెట్టించింది. ఫెడ్‌ వడ్డీరేట్లలో భారీగా కోత‌లు పెట్టేసింది. దీంతో ఎంసీఎక్స్‌లో సోమవారం ఉదయం పది గ్రాముల బంగారం రేటులో ఏకంగా రు. 700 పెరిగింది. దీంతో ఇప్పుడు 10 గ్రాముల బంగారం రేటు రూ 41,068కి పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం కూడా బంగారం రేటు బెంబేలెత్త‌డానికి కార‌ణ‌మైంది.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇక వెండి ధరలు సైతం బంగారం బాటలోనే రేసుగుర్రంలా దూసుకు పోతున్నాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ 338 పెరిగి రూ 40,825కు ఎగబాకింది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో వ‌చ్చే వారం రోజుల్లో బంగారం రేట్లు, వెండి రేట్ల‌కు బ్రేకులు వేయండం సాధ్య‌మ‌య్యేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: