ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను అత‌లా కుత‌లం చేస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ సైతం అప్ డౌన్ అవుతోంది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన సెన్సెక్స్‌, నిఫ్టీ కుప్ప కూలుతున్నాయి. ఇక క‌రోనా దెబ్బ‌తో డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ ఘ‌రంగా ప‌త‌న‌మ‌వుతోంది. తాజాగా డాల‌రుతో పోలిస్తే మారకంలో రూపాయి తొలిసారి 75 మార్క్‌ కిందికి పడిపోయింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో  గురువారం రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమైంది. బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల నష్టం. అనంతరం మరింత దిగజారి ఏకంగా 81 పైసలు(1.1 శాతం) 75.08 వద్ద ట్రేడవుతోంది.



ఇది ఓ హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు మ‌రింత కుప్ప‌కూల‌వ‌చ్చ‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో మ‌దుపరులు పెట్ట‌బ‌డులు పెట్టేందుకు ముందుకు రావ‌డం లేదు. ఇక ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ముడిచమురు, కరెన్సీలను సైతం దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్‌ కనిష్టాన్ని తాకింది.



ఇదిలా ఉంటే బుధవారం రూపాయి నామమాత్రంగా 2 పైసలు డౌన్ అయ్యింది. ఇది మంగ‌ళ‌వారం సైతం ఇదే ధోర‌ణిలో ముందుకు వెళ్లి 74.28 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈ‍క్విటీ  మార్కెట్లు భారీ నష్టాలనుంచి భారీ రికవరీ సాధించాయి. సెన్సెక్స్‌ 277 పాయింట్ల లాబంతో, నిఫ్టీ 50  పాయింట్ల లాభంతోనూ కొనసాగుతున్నాయి.  తద్వారా  సెన్సెక్స్‌ కనిష్టం నుంచి 2000, నిఫ్టీ 600, నిఫ్టీ బ్యాంకు 2100 పాయింట్లు  పుంజుకోవడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: