ఇన్నాళ్లు పేటీఎం.. గూగుల్ పే.. ఫోన్ పే వాడేవారికి శుభవార్త.. అవి ఎందుకయ్యా మోసాలు జరుగుతాయి అని వాడకుండా ఉన్నవారికి పెద్ద దెబ్బ. ఏంటి ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపించి ప్రజలను బయాందోళనకు గురిచేస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ కరోనా వైరస్ ప్రపంచం అంత వ్యాపించి భారత్ కు చేరుకొని అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు.. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాలు సంచలన కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. రేపు జనతా కర్ఫ్యూ కూడా విధించింది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఇకపోతే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటానికి కరెన్సీ నోట్లు కూడా ఒక కారణమే. అందుకే.. ఇక్కడ కూడా కరోనా వైరస్ అలాగే వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. కరెన్సీ నోట్లతో జాగ్రత పడాలని ఎస్‌బీఐ ప్రభుత్వానికి సూచిస్తోంది. అన్నింటి కంటే కరెన్సీ నోట్లతోనే వైరస్ వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ చేసిన పరిశోధనలో తేలింది అని ఎస్‌బీఐ రీసెర్చ్ బృందం తెలిపింది. కరెన్సీ నోట్లు అన్ని కూడా కాగితంతో చెయ్యడం వల్ల ఇన్ఫెక్షన్లు.. వైరస్ లు వస్తున్నాయి అని.. అందుకనే కెనాడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తరహాలోనే పాలిమర్స్ నోట్లను తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్బిఐ కోరింది.. 

 

అయితే ఇది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.. కానీ నగరాల్లో అయితే ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ ఉపయోగించి గట్టెక్కచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ అవాకాశం చాలా తక్కువ.. అందుకే కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని స్పష్టం చేశారు. మరి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఏలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: