దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి అంతరాయం లేకుండా బ్యాంకింగ్ సర్వీసులు కొనసాగిస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లకు మెరుగైన సౌకర్యం అందే విధంగా చర్యలు చేపడుతున్నామని ప్రకటన చేసింది. 
 
కస్టమర్లకు వీలైనన్ని బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండేలా చూస్తామని... కస్టమర్లు మాత్రం బ్యాంకుకు అత్యవసరం అయితే తప్ప రావొద్దని ఐబీఏ సూచించింది. ఖాతాదారుల నుంచి తమకు సహాయం కావాలని... ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలనే బ్యాంక్ ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారని ఐబీఏ చెప్పింది. ఈరోజు నుంచి కస్టమర్లకు డిపాజిట్, విత్ డ్రా, చెక్ క్లియరింగ్, రెమిటెన్స్, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లు అందుబాటులో ఉంటాయని... ఇతర సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. 
 
ఐబీఏ ఖాతాదారులు ఆన్ లైన్ ద్వారా వీలైనన్ని సేవలు పొందాలని సూచించింది. ఖాతాదారులకు 24 గంటలు ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటామని పేర్కొంది. ఖాతాదారులు అవసరమైతే బ్యాంక్ బ్రాంచ్ కు ఫోన్ చేయాలని... బ్యాంక్ సర్వీసులను ఐవీఆర్ ఫెసిలిటీ ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: