ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా  వైరస్ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కరోనా  వైరస్ ప్రభావం కేవలం మనుషులకే కాదు అన్ని రంగాలపైనా కూడా పడుతుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రంగాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇక ఈ కరోనా  వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ మీద పడి దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. దీంతో మూడు రోజుల వ్యవధిలోనే స్టాక్ మార్కెట్లు రెండు సార్లు వాయిదా పడ్డాయి. అయితే స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇలా మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు వాయిదా పడడం ఇదే  మొదటిసారి. ఇక తాజాగా భారత స్టాక్ మార్కెట్లు మరోసారి పతనం అయిపోయాయి. దీంతో  ఏకంగా ఎనిమిది వేల పాయింట్లకు దిగువన ఓపెన్ అయింది. అంటే నీటి 8.66% 757.05 పాయింట్లు పతనమై... 7988.40 దగ్గర ఓపెన్ అయింది. 2991 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ వెళ్తుంది. ఈ నేపథ్యంలో కోట్ల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయి. 

 

 

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ ప్రభావం అన్ని దేశాలపై ఉండటం ఒక కారణమైతే... భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్  ప్రకటించిన నేపథ్యంలో... ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు ఎక్కువగా అమ్మడానికి ముందుకొస్తున్నారు. ఇక ఫార్మా రంగానికి చెందిన షేర్లు కొనుగోలు పెరగడంతో స్టాక్ మార్కెట్ లో కాస్త కుదుట  పడుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం పుంజుకోలేకపోతున్నాయి. ఇక రోజు రోజుకు స్టాక్ మార్కెట్లు పతనం అయిపోయి డీలా పడిపోవడంతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొంది. 

 

 ఇక భారతీయ స్టాక్ మార్కెట్ పై  అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. ఒక్క జపాన్ స్టాక్ మార్కెట్ తప్ప మిగతా ఆసియా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతుండటం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ పై  ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక భారతీయ స్టాక్ మార్కెట్లు రోజురోజుకు నష్టాలను చవి చూస్తున్న నేపథ్యంలో రూపాయి విలువ ఘోరంగా పతనమై పోతుంది. డాలర్ తో  పోలిస్తే రూపాయి విలువ 76 పడిపోయింది. స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూస్తున్న నేపథ్యంలో వేల కోట్లలో సంపద ఆవిరైపోయింది. అయితే ఇన్వెస్టర్లు కొన్నిరోజులపాటు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: