కరోనా వైరస్.. ఛీఛీ పేరు పలకాలి అంటేనే కంపరంగా ఉంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసి పడేసింది. ఎవరో ఎక్కడో ఏదో తింటే అది కొన్ని వేలమంది ప్రాణాలను తీస్తుంది. ఛీఛీ.. లక్షలమంది కరోనా వైరస్ బారిన పడి విలవిలలాడుతున్నారు.. పాపం ప్రజలు అంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. 

 

ఇంకా ఈ కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు ఆగిపోయాయి.. ఒక్క వైద్య రంగం తప్ప. వైద్య రంగం కూడా ఆగిపోతే ఇంకా ప్రపంచం ఉండదు. ఇందులో సందేహం లేదు. ఇకపోతే ఈ కరోనా వైరస్ వల్ల కంపెనీలు అన్ని నష్టాల్లో కూరుకుపోయాయి.. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలిగిస్తుంది.. వేతనాల్లో కోతలు విదిస్తుంది. దీంతో మనిషి జీవినం కష్టంగా మారిపోయింది. 

 

దీంతో దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరిశ్రమ సమాఖ్య అసోచామ్ బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చే డిమాండ్‌ను తెర మీదకు తీసుకువచ్చింది. అది ఏంటి అంటే? వడ్డీ చెల్లింపులపై ఏడాది పాటు బ్రేక్ వెయ్యాలని బ్యాంకులను కోరింది. కార్పొరేట్స్, ఇండివీజువల్స్‌కు ఈ సదుపాయాన్ని కల్పించాలని తెలిపింది. కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో అసోచామ్ ఈమేరకు బ్యాంకులను కోరింది. మరి ఈ విషయం చివరికి ఎం అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: