అవును.. అంతేగా. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. కానీ ఏమైనా ఉపయోగం ఉందా? పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజుల నుండి రోజు తగ్గుతూనే వస్తున్నాయి. కానీ ఏమి ఉపయోగం. పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంత తక్కువ ధరకు వస్తున్నాయి. కానీ ప్రజలు విచ్చలవిడి తిరగడానికి అవకాశం లేదు. 

 

ఎందుకంటే? ఏ కరోనా వైరస్ వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు అతి భారీగా తగ్గాయో.. అదే విధంగా.. ఆ కరోనా వైరస్ వల్లే ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఎందుకంటే దేశమంతా లాక్ డౌన్ కదా.. బయటకు వస్తే శ్మశానం కి అయినా వెళ్తారు... లేదు అంటే పోలీసులతో ఒళ్ళు పచ్చడి చేయించుకోండి ఇంటికి అయినా వెళ్తారు. ఎలా వెళ్తే ఏంటో కరోనా వల్ల బాగానే దెబ్బలు పడుతాయి కదా!

 

ఇకపోతే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా కొనసాగుతున్నాయి అంటే.. నేడు బుధువారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. కేవలం ఒక వారంలో ఏకంగా ఆరు రూపాయిలు తగ్గింది అంటే నమ్మండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: