క్రెడిట్ కార్డు వాడుతున్న వినియోగ‌దారుల‌కు రిజ‌ర్వు బ్యాంకు తీపి క‌బురు చెప్పింది. లోన్ ఈఎంఐ మారటోరియం రూల్స్ క్రెడిట్ కార్డుకు కూడా వర్తిస్తాయని శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీంతో క్రెడిట్ కార్డు కలిగిన వారికి ప్రయోజనం కలుగనుంది. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యా లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. తాజాగా రిజ‌ర్వు బ్యాంకు కూడా అదే బాట‌లో న‌డిచింది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ రేటు 4.4 శాతానికి దిగొచ్చింది. ఇక రివర్స్ రెపోను 90 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో ఈ రేటు 4 శాతానికి త‌గ్గ‌డం విశేషం. 

 

అంతేకాకుండా రుణ ఈఎంఐలపై 3 నెలల పాటు మారటోరియం విధించింది. ఇది అన్ని రుణాల‌కు వ‌ర్తిచ‌నుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, పంట రుణాలు వంటివి అన్నీ కవర్ అవుతాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ తమ కస్టమర్లకు ఈఎంఐ మారటోరియం ప్రయోజనాన్ని అందించనున్నాయి.ఇకపోతే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడం లక్ష్యంగా రిజర్వు బ్యాంక్ రెపో రేటును త‌గ్గించింద‌నే ప‌రిణామాల‌ను బ‌ట్టి అవ‌గ‌త‌మ‌వుతోంది.కేవలం రుణ చెల్లింపులపై మారటోరియం మాత్రమే కాకుండా అసోచామ్ ఇంకా పలు ప్రతిపాదనలు చేసింది. 

 

దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు వెంటనే నిధులు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.  కరోనా వైరస్ వంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్లను ఎదుర్కునేందుకు సిద్ధం కావడం అంత సులువైన విషయం కాదని అసోచామ్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.  కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం విలవిలలాడుతోంది. దాదాపు అన్ని రంగాలపై ఆర్థిక ప‌ర‌మైన  ప్రతికూలత‌లు ప్ర‌భావం చూపుతున్నాయి.  ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దైనందిన కూలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డేందుకు క‌నీసం ఏడాదైనా ప‌డుతుంద‌ని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: