ప్రధాని మోదీ మధ్యతరగతి ప్రజలకు భారీ షాక్ ఇచ్చారు. కేంద్రం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజుల నుండి కేంద్రం వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వస్తున్న వార్తలు నిజమయ్యాయి. కేంద్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, ఇతర పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. జూన్ నెల వరకు తగ్గించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. 
 
ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్రం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. కేంద్రం పీపీఎఫ్ వడ్డీ రేటులో 80 బేసిక్ పాయింట్ల కోత విధించింది. పీపీఎఫ్ అకౌంట్ పై వడ్డీరేటు 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో వడ్డీ రేటు 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గింది. సంవత్సర కాలం డిపాజిట్లపై 1.4 శాతం వడ్డీ రేటు తగ్గిందని తెలుస్తోంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ వడ్డీ రేటు 8.4 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గింది. 
 
ఈ పథకాలతో పాటు టైమ్ డిపాజిట్స్, కిసాన్ వికాస్ ప్రత, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పై వడ్డీ రేట్లు తగ్గాయి. ఈ పథకాలన్నీ పోస్టాఫీస్ లో అందుబాటులో ఉండగా కొన్ని పథకాలు మాత్రం బ్యాంక్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉండటం గమనార్హం. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లను తగ్గించడంతో పాటు వడ్డీ రేట్లను కూడా సవరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: