పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. కరోనా మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్ లు దారుణంగా అంటే అతి దారుణంగా పడిపోయాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరగగా పెట్రోల్, డీజిల్ ధరలు 25 శాతం కనిష్ఠానికి పడిపోయాయి. దీంతో కేవలం మూడు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు రూపాయిలు తగ్గాయి. 

 

అయితే ఆలా తగ్గక ముందు కూడా గత నెల రోజులు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. రోజుకు 10 పైసలు.. 20 పైసలు ప్రకారం తగ్గుతూ ఏకంగా 3 రూపాయిలు తగ్గాయి. జనవరి మొదటి నెలలలో 80 రూపాయిలు దాటినా పెట్రోల్, డీజిల్ ధరలు జనవరి తర్వాత తగ్గుతూ ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 73 రూపాయిలుగా ఉంది. అంటే కేవలం మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా ఏడు రూపాయిలు తగ్గాయి. అయితే గత మూడు వారల నుండి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

దీంతో నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: