జియో వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే.. ఎందుకంటే? లాక్ డౌన్ నడుస్తున్న ఈ సమయంలో తన వినియోగదారులకు ఈ శుభవార్తను అందించింది. వ్యాపార, ఈ-కామర్స్ వర్గాలకు కాస్త కష్టంగా ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలు వారి వినియోగదారులకు సేవలు అందించడానికి విన్నూత మార్గాలను ఎంచుకుంటున్నాయి. 

 

ఇంకా అలా విన్నూత మార్గాలను ఎంచుకునే దానిలో జియో ముందు ఉంటుంది అనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే జియో తన వినియోగదారులు నేరుగా ఏటీయం నుండే రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు చేయాల్సిందల్లా మీ ఏటీయం కార్డుతో ఏటీయం దగ్గరకు వెళ్లి రీచార్జ్ చెయ్యడమే.. 

 

రిలయన్స్ జియో అధికారిక ప్రకటన ప్రకారం జియో వినియోగదారులు ఏయూఎఫ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఐడీఎఫ్ సీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీయం మెషీన్లలో కూడా ఈజీగా రీచార్జ్ చేసుకోవచ్చు. 

 

మీ డెబిట్ కార్డును ఏటీయం మెషీన్ లో పెట్టి మెయిన్ మెనూలో రీచార్జ్ ఆప్షన్ ను ఎంచుకొని రీచార్జ్ మెనూలోకి వెళ్లాక మీ జియో నంబర్ ను ఎంటర్ చేయండి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశాక ఎంటర్ బటన్ ను నొక్కాలి.. ఆతర్వాత ఎంత మొత్తంతో రీచార్జ్ చేయాలనుకుంటున్నారో తెలిపి మళ్లీ ఎంటర్ నొక్కాలి. అంతే జియో రీఛార్జ్ అయిపోతుంది. అయితే నిజం చెప్పాలి అంటే.. ఒక్క రీఛార్జ్ కోసం ఏటీఎం దగ్గరకు వెళ్లి ఇంత ప్రాసెస్ చేసే బదులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేస్తే క్షణాల్లో అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: