దేశీయ దిగ్గజ బీమా కంపెనీ ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 100 రూపాయల ప్రీమియం చెల్లించి 75,000 రూపాయల బీమా పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఈ పాలసీని అసంఘటిత రంగంలోని కార్మికులు తీసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అందిస్తున్న ఈ పాలసీని ఎల్‌ఐసీ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. 
 
కుటుంబంలో ఎక్కువ వయస్సు గల వ్యక్తి లేదా సంపాదించే వ్యక్తి ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకునే వారి వయస్సు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పథకంలో చేరాలంటే మొదట 200 రూపాయలు కట్టాలి. 200 రూపాయలు చెల్లిస్తే 30,000 రూపాయల బీమా కవరేజ్ కు ఇది వర్తిస్తుంది. కానీ కేంద్రం 100 రూపాయలు సామాజిక భద్రత ఫండ్ నుంచి చెల్లిస్తుంది కాబట్టి కస్టమర్లు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 
 
ఈ పథకంలో చేరిన వ్యక్తి సహజంగా మరణిస్తే 30,000 రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ప్రీమియం చెల్లించిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణించినా... శాశ్వత అంగ వైకల్యం సంభవించినా 75,000 రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఈ పాలసీ తీసుకున్న వారి పిల్లలకు ఎల్‌ఐసీ స్కాలర్ షిప్ అందిస్తుంది. 9 నుంచి 12వ తరగతిలోపు చదివే విద్యార్థులకు ఎల్‌ఐసీ ప్రతి ఏడాది జనవరి 1... జులై 1న 600 రూపాయల చొప్పున 1200 రూపాయలు అందిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: