కరోనా సంక్షోభం తో దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో ఏప్రిల్ 14వరకు విమానయాన సేవలు కూడా రద్దయ్యాయి. అయితే ఒకవేళ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తే 15నుండి సేవలను పునరుద్ధరించడానికి విమానయాన సంస్థలు రెడీ గా వున్నాయి. అందులో భాగంగా నిన్నకొన్ని దేశీయ విమానయాన సంస్థలు బుకింగ్స్ ఓపెన్ చేశాయి దాంతో చాలా మంది లాక్ డౌన్ పొడిగింపు వుండేదేమోనని అనుకున్నారు. అయితే కొద్దీ సేపటి క్రితం ఎయిర్ ఇండియా ఈ రోజు నుండి ఏప్రిల్ 30 వరకు అంతర్జాతీయ అలాగే దేశీయ ప్రయాణాల బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 14తరువాత లాక్ డౌన్ పై స్పష్టత వచ్చాకే మళ్ళీ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి పూర్తిగా రీ ఫండ్ ఇవ్వన్నట్లు కూడా తెలిపింది. ఇక ఎయిర్ ఇండియా బుకింగ్స్ క్లోజ్ చేయడం తో  లాక్ డౌన్ మరి కొన్ని రోజులు  వుండనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
మరో వైపు విస్తార ఎయిర్ లైన్స్ మాత్రం ఈనెల 15నుండి బుకింగ్స్ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక లాక్ డౌన్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. లాక్ డౌన్ పొడిగింపు పై కేంద్రం నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు అయితే రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను మరి కొన్ని రోజులు పొడిగిస్తారని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: