కోవిడ్‌-19 ప్ర‌పంచాన్ని మ‌రింత వెన‌క్కి నెడుతోంది. మ‌నుష్యుల జీవితాల‌ను, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కొలుకోని విధంగా దెబ్బ‌కొట్టింది. ఐరోపా దేశాల్లో వేలాది ప్రాణాలు గాలిలో క‌లిసిపోగా అంతే స్థాయిలో పెద్ద‌పెద్ద కంపెనీలు మూత‌ప‌డ్డాయి. ఫ‌లితంగా ల‌క్ష‌లాది మంది మంది ఉపాధిని కోల్పోయారు. అనేక దేశాల్లో నిరుద్యోగం పెరుగుతోంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం భార‌త్‌ను కూడా చుట్టుముట్టింది. లాక్‌డౌన్ అమ‌లుతో ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అవుతోంది. చిన్నా పెద్ద‌, భారీ, మ‌ల్టీనేష‌న‌ల్ ఇలా అన్ని రంగాల‌కు చెందిన కంపెనీలు మూత‌ప‌డ్డాయి. సుధీర్ఘ‌కాలం లాక్‌డౌన్ కొన‌సాగ‌డం..ఇప్ప‌ట్లో క‌రోనా స‌మసిపోతాయా అన్న సందేహాలా నేప‌థ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగాల‌కు కోత విధించాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. 

 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో 21రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లు కావ‌డంతో చాలా కంపెనీలు న‌ష్టాలు చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఎగుమ‌తులు నిలిచి పోవ‌డంతోదేశ ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో రూపాయి మార‌కం విలువ గ‌తంలో ఎన్న‌డూ లేనంతంగా ప‌డిపోయింది. వేలాది పెద్ద కంపెనీలు న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి వారికి క‌న‌బ‌డుతున్న ఏకైక మార్గం మ్యాన్‌ప‌వ‌ర్ త‌గ్గించుకోవ‌డం. అందుకే చాలామంది ఉద్యోగులకు కంపెనీల హెచ్ఆర్‌ల వాట్సాప్ నెంబ‌ర్ల నుంచి మెసేజ్‌లు అందుండ‌టం గ‌మ‌నార్హం.

 

 లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీ కోతలు ఉంటాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ‘కొవిడ్‌ 19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలపై ప్రభావం - సీఈఓల స్నాప్‌ పోల్‌’ పేరిట సీఐఐ గతవారం ఓ సర్వే నిర్వహించింది. ఆదివారం వాటి ఫలితాలు ప్రకటించడంతో ఉత్పాదక రంగాల్లోని ఉద్యోగులు కలవరపాటుకు గుర‌వుతున్నారు.   సీఐఐ  గతవారం 200 మందికిపైగా సీఈఓలతో ఆ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార‌త్‌లో లాక్‌డౌన్ ముగిసాక అనేక రంగాల్లో ఉద్యోగాల కోత భారీగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తోంది. దాదాపు 52 శాతం మంది సీఈఓలు ఇదే విష‌యాన్ని ధ్రువీక‌రించిన‌ట్లు  సీఐఐ త‌న స‌ర్వేలో పేర్కొంది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: