కోవిడ్‌-19 సృష్టిస్తున్న ప్ర‌ళ‌యానికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రభావానికి ఎవ‌రూ అతీతులు కారు. అంద‌రిలానే దేశంలోనే అత్యంత సంప‌న్నుడైన ముఖేష్ అంబానీ సంప‌ద ఆవిరైపోతోంది. కోవిడ్ -19  కార‌ణంగా ముఖేశ్ అంబానీ గ‌డిచిన రెండు నెల‌ల కాలంలో  తీవ్రంగా న‌ష్ట‌పోయారు.  హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్  వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం... కరోనా వైరస్ కారణంగా  రెండు నెలల్లో ముఖేశ్ నికర ఆస్తుల విలువ‌లో  దాదాపు 19 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1.44 లక్షల కోట్లు న‌ష్టపోయార‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా క‌రోనా ఉధృతి తొలిరోజుల్లో అంటే  ఫిబ్రవరి మొదటి వారంలో రూ.1,400గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల విలువ ఏప్రిల్ 3వ తేదీ నాటికి 1,077కి పడిపోవ‌డం గ‌మ‌నార్హం. 

 

ఆ సంస్థ టెలికాం యూనిట్ జియోలో ఓ వాటాని ఫేస్‌బుక్ కొనుగోలు చేయక ముందు గత 52 వారాల్లోనే అత్యల్పమైన రూ.877.65లకు సంస్థ షేర్లు దిగజారిపోవ‌డం విశేషం. కోవిడ్-19 ప్రభావం భారతదేశంలోని ధనవంతులపై తీవ్రస్థాయిలో పడింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ 5 బిలియన్ డాలర్లు, హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్ నడార్ 5 బిలియన్ డాలర్లు, ఉదయ్ కోటక్ 4 బిలియన్ డాలర్ల నష్టం వీరి నికర విలువలో ఏర్పడింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లంద‌రూ త‌మ సంప‌ద‌ను కోల్పోతూ వ‌స్తున్నారు. క‌రోనాతో ఉత్పత్తి, సేవారంగాలు, అమ్మ‌కాలు  నిలిచిపోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఎదుర‌వుతోంది.

 

 అయితే కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నష్టపోయిన ధనికుల్లో అంబానీ రెండో స్థానంలో ఉన్నార‌ని తెలుస్తోంది.  అలాగే  ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నాడ్ అర్నౌల్ట్ దీని కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో మొదటిస్థానంలో ఉన్నారు. ఈ సంక్షోభంలో ఆయన ఆస్తిలో దాదాపు 28శాతం నష్టం వాటిల్లిన‌ట్లు ప‌లు నివేదిక‌లు వెల్ల‌డిస్తుండ టం గ‌మ‌నార్హం. మ‌రికొద్ది రోజుల పాటు ఇలాంటి ప‌రిస్థితులే ఉంటే ముఖేశ్ అంబాని స‌హా ప్ర‌ముఖ వ్యాపారులంతా ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌న‌ను న‌ష్ట‌పోవాల్సి ఉంటుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ముఖ కార్పొరేట్లు ముందుకు వ‌చ్చి విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: