దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది సాఫ్ట్ వేర్, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. అన్ని రంగాల్లో మాదిరిగానే సాఫ్ట్‌వేర్ ప‌రిశ్ర‌మ‌లోనూ ఇప్పుడు సంక్షోభం ఏర్ప‌డ‌బోతోంది.కరోనా వైరస్ ఉనికిలోకి రావడంతో అనేకమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తొలిరోజుల్లో ‘వర్క్ ఫ్రం హోమ్’ ఉంటుంది గదా అనే ధీమాతోనే ఉన్నారు. కానీ ‘లాక్‌డౌన్’ పరిస్థితి అనంతరం వారి ఉద్యోగాలకు ఎసరు వస్తుందేమో అనే ఆందోళన ఇప్పుడు వారిని వెంటాడుతోంది.   ప్రస్తుత లాక్ డౌన్ తర్వాత వీరిలో ఎంత మంది ఉద్యోగాలు గల్లంతవుతాయో చెప్పలేమని, చాలా మంది రోడ్ల మీద పడక తప్పదని సంస్థ‌ల సీఈవోలు అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇప్పటికే పుణె, బెంగళూరు, గుర్గావ్ తదితర నగరాల్లో ఐటీ ఉద్యోగులపై స్వచ్చందంగా రాజీనామా చేయాలన్న ఒత్తిడి ఎక్కువ‌వుతోందంట‌.

 

 హైదరాబాద్‌లోని ప‌లు సంస్థ‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని స‌మాచారం. ఇదే జరిగితే ఇక్కడ 2008 తరహాలో వేలాది మంది సాఫ్ట్ వేర్ఇం జనీర్లు ఇంటిదారి పట్టక తప్పదని అంటున్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతల మవుతున్న విష‌యం తెలిసిందే. అమెరికా, చైనాతో పాటు ప‌లు యూర‌ప్ దేశాల్లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. యూర‌ప్‌లోని చాలా దేశాలు క‌రోనా కుదుపు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి చాలా స‌మ‌యం ప‌డుతుందన్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.  ఇప్ప‌టికే అక్క‌డి దేశాల్లో చాలా రోజులుగా లాక్‌డౌన్ కొన‌సాగుతూ వ‌స్తోంది. మ‌రి ఇంకెన్ని రోజులు అలా ఉండాల్సి వ‌స్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిని వేల కోట్ల డాలర్ల సంపద ఆవిరవుతోంది. ఈప్ర‌తిష్ఠంభ‌న భార‌త ఐటీ ప‌రిశ్ర‌మ‌పై ప‌డుతోంది.

 

 మ‌న‌కు వ‌చ్చే వ‌ర్క్ ఆర్డ‌ర్స్‌లో ఆయా దేశాల నుంచే ఎక్కువ‌గా ఉంటాయ‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అనేక దేశాలు కొత్త ప్రాజెక్టులు ఇచ్చే ప‌రిస్థితిలోలేవు. ఈ నేప‌థ్యంలో  ఈ ప్రభావం భారత్ పై ఎలా ఉండబోతోందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఇండియన్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.హైద‌రాబాద్ న‌గ‌రంలోని అనేక సాప్ట్‌వేర్ పరిశ్రమలు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోని పెద్ద కంపెనీలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి సేవలందిస్తున్నాయి. ఆ దేశాల్లోని ఆర్థికవ్యవస్థ, ఐటీ పరిశ్రమల ఆర్థిక వనరులు దెబ్బతినడంతో ఇప్పుడు ఇక్కడి ఐటీ పరిశ్రమలో కూడా అనుమానాలు ముసురుకున్నాయి. నగరంలో సుమారు ఐదారు లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భ‌విత‌వ్యం ఎలా ఉండ‌బోతోంది..వారి న‌మ్ముకున్న ఇత‌ర కార్మికులు, శ్రామికుల ప‌రిస్థితి ఏంటీ అన్న‌ది ఊహిస్తేనే కొంచెం భ‌యం మేస్తోంది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: