పెట్రోల్, డీజిల్ ధరలు రెండు నెలల ముందు వరుకు ఒకోసారి ఒకోలా ఉండేవి కానీ ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గుదల.. పెరుగుదల అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు రోజు తగ్గుతూ పెరుగుతూ ఉండే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

నెల రోజుల క్రితం కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు అతి దారుణంగా పడిపోయాయి.. దీంతో అప్పుడు కేవలం మూడు రోజులకే నాలుగు రూపాయిలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే ఆ తర్వాత కూడా పైసల రూపంలో తగ్గుతూ వచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

దీంతో నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంకా లాక్ డౌన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: