స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ. ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అన్ని రకాలసేవలను అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ లోన్స్, ఇన్సూరెన్స్, హోమ్ లోన్ , నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వివిధ సేవలను అందిస్తోంది. తాజాగా ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ అందిచింది. రెపో రేటు తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా (ఎస్‌బీ) డిపాజిట్లపైనా పడింది. 

 

ఈ ఖాతాల్లోని డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. అదనపు నిధుల సమీకరణ వ్యయం (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ తగ్గింపు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తుంది. 

 

ఇక దీంతో ఈఎంఐలు దిగిరానున్నాయి. ఎస్‌బీఐలో హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లాంటి రుణాలు తీసుకున్నవారందరికీ ఇది వర్తిస్తుంది. అన్ని కాలవ్యవధుల రుణాలకు ఇది వర్తించనుంది. అలాగే హోమ్ లోన్ కస్టమర్లకు 30 ఏళ్ల లోన్‌పైన రూ.1,00,000 పై రూ.24 చొప్పున ఈఎంఐ తగ్గుతుంది. అయితే ఎంసీఎల్ఆర్‌తో లింక్ చేసిన లోన్లు తీసుకున్న రుణగ్రహీతలకే ఇది వర్తిస్తుంది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ వడ్డీని తగ్గించడం వరుసగా ఇది 11వ సారి. 

మరింత సమాచారం తెలుసుకోండి: