నిన్నటి రోజు మంగళవారం ఒక రేంజ్ లో లాభపడ్డాయి దేశీ స్టాక్ మార్కెట్స్. దీనితో మదుపరులందరు చాలా సంతోషంతో ఎగిరి గంతేశారు. కానీ... దేశీ స్టాక్ మార్కెట్ మళ్లీ ఈరోజు ఢమాల్ అయ్యింది. ముఖ్యంగా బెంచ్‌ మార్క్ సూచీలు డీలా పడ్డాయి. నిజానికి దీనికి కారణం కరోనా వైరస్ భయాలు వెంటాడం. దీనితో మార్కెట్ నేడు నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కొట్టుకొచ్చింది. దీనితో ఈరోజు సూచీలు మాత్రం తీవ్ర ఊగిసలాటలు జరిగి చివరికి నష్టాలలో ముగిసాయి.

 

 

ఇక ఈరోజు సెన్సెక్స్ మొత్తానికి 1625 పాయింట్ల శ్రేణిలో కదిలింది. అలాగే నిఫ్టీ కూడా 478 పాయింట్ల శ్రేణిలో ట్రేడ్ అయ్యింది. ఇక చివరకు సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టంతో 29,894 పాయింట్ల వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 8749 పాయింట్ల మధ్యలో ముగిసాయి. ఇక ఈరోజు ప్రధాన అంశాల విషయానికి వస్తే... నిఫ్టీ 50 లో ఎన్‌టీపీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్,  వేదాంత, సన్ ఫార్మా, సిప్లా, షేర్లు లాభాల బాట పడ్డాయి. ఇందులో వేదాంత గ్రూప్ ఏకంగా 5 శాతానికి పైగా పెరిగింది.

 

 

ఇక నష్టాల విషయానికి వస్తే... టైటన్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీ సిమెంట్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేరు దాదాపు 4% నష్ట పోయింది. ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లు అన్ని మిశ్రమంగా ముగిసాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌, నిఫ్టీ టో, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ లు లాభాలలో ముగిసాయి. అలాగే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మొత్తానికి 4 % ర్యాలీ చేసినా నష్టాలలో ముగిసింది. ఇకపోతే మిగతా ఇండెక్స్‌ లు అన్ని నష్టాలలో ముగిసాయి. ఇందులో నిఫ్టీ రియల్టీ 1% పైగా కోల్పోయింది. ఇక రూపాయి విషయానికి వస్తే అమెరికా డాలర్‌ తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడ్ అయ్యింది. మొత్తానికి 71 పైసలు నష్టంతో 76.34 వద్ద ట్రేడ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: