ప్రస్తుతం కరోనా వైరస్ ఎవరి కంటే వారికీ వ్యాపిస్తుంది. అది కనిపించని వైరస్ కావడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను కూడా చాలామంది బిజినెస్ చేసుకుంటున్నారు. దీంతో ఈ కరోనా వైరస్ పై ఇప్పటికే ఎన్నో బిజినెస్ లు చేసుకోగా ఇప్పుడు మరో కొత్త రకమైన బిజినెస్ లు తెర మీదకు వచ్చాయి. 

 

అవి ఏంటి అంటే? కోవిడ్ 19 ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్‌. ఈ స్కీమ్‌ ను రిలయన్స్ జనరల్ తాజాగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ అని వస్తే చికిత్సకు బీమా మొత్తం ఒకే సారి పొందొచ్చు. ఒకవేళ పాలసీదారుడు క్వారంటైన్‌లో ఉంటే బీమా మొత్తంలో సగం చెల్లిస్తారు.

 

అయితే ఈ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ఏడాది. ఈ పాలసీ వెయిటింగ్ పిరియడ్ 15 రోజులు.. అంటే ఈ పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాత కరోనా వైరస్ అనుకోకుండా వస్తే బీమా మొత్తాన్ని పొందొచ్చు .. ఈ పాలసీ ద్వారా ప్రజలకు ఆర్ధిక భారం పడకుండా ఉంటుంది. ఇంకా ఈ పాలిసీని 3 నెలల నుండి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఈ పాలసీని పొందవచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఈ పాలసీని వెంటనే తీసుకోండి.. మహమ్మారిని ఆర్ధిక ఇబ్బంది లేకుండా ఎదురుకొండి.

మరింత సమాచారం తెలుసుకోండి: