ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి రోజురోజుకీ బాగా పెరిగిపోతుంది. దీనితో ప్రజలు అందరూ కూడా భయాందోలనలతో జీవిస్తున్నారు. అంతేకాకుండా రోజువారి కష్టంలో జీవనం కొనసాగించే వారికి చాలా కష్టాలు ఎదురయ్యాయి అని చెప్పాలి. ఈ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ నిబంధన అమలు చేయడంతో  ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలు పడుతున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చినవారు అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. 

 


ఇలాంటి వారి కోసం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వారు ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వస్తే ఎవరికైనా కరోనా వైరస్ పాజిటివ్ అని నమోదు అవుతే వారికి 100% బీమా ఇవ్వడమే ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత అని రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా ఒకవేళ పాలసీ దారుడు  ఎవరైనా క్వారంటైన్ లోకి వెళ్తే వారికి 50 శాతం భీమా లభిస్తుందని తెలియజేయడం జరిగింది. ఇందుకు పదిహేను రోజుల వెయిటింగ్ సమయంగా నియమించడం జరిగింది. 

 


ఈ పాలసీ తీసుకరావడానికి ముఖ్య ఉద్దేశం ఏమి అన్న విషయానికి వస్తే ఈ మహమ్మారి వల్ల ఎదురయ్యే ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం ఈ పాలసీని అమలులోకి తీసుకొని వచ్చామని రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ CEO, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ జైన్ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ పాలసీ మూడు నెలల నుంచి 60 ఏళ్ల వయసు గల వారు ఎవరైనా పాలసీ పొందే దానికి అర్హులు అని తెలిపారు. ఇక బీమా ఆప్షన్ విషయానికి వస్తే 25000 నుంచి రెండు లక్షల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించడం జరిగింది. 

 


ఇక అంతే కాకుండా కరోనా వైరస్ బారిన పడిన వారి కోసమే కాదు.. ఈ మహమ్మారి సంక్షోభ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి కూడా కవరేజి పొందవచ్చు అని కంపెనీ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇలా లబ్ధి పొందడానికి కోసం యాడ్ ఆన్ ని ఎంచుకోవాలని తెలిపారు. మార్కెట్లోకి వైరస్ కవరేజి ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీలు తాజాగా రావడం జరిగింది. కానీ ఉద్యోగం కోల్పోయిన కవరేజ్ వారి కోసం ఏ ఇన్సూరెన్స్ కూడా అమలు చేయలేదు. అలాంటి వారి కోసమే ఈ పాలసీ ప్రత్యేకత అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: