బ్యాడ్‌ న్యూస్.. మళ్లీ పెట్రో రేట్లు పెరుగుతాయ్.. అవును.. ఎందుకంటే.. రష్యా-సౌదీ అరేబియాల  మధ్య ధరల యుద్ధానికి తెరదించేందుకు ఒపెక్  దేశాలు ఒక్కటయ్యాయి. క్షీణిస్తున్న చమురు ధరలు మళ్లీ పుంజుకోవాలనే లక్ష్యంతో ఉత్పత్తి పెంచాలని నిర్ణయించాయి. 

 

 

కరోనా మహమ్మారి దెబ్బకు విశ్వవ్యాప్తంగా చమురు అమ్మకాలు తగ్గిన ధరలు పతనమైన సంగతి తెలిసిందే. అందుకే.. చమురు ఉత్పత్తి చేసే ఒపెక్  దేశాలు ఇంధనం ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. వియన్నాలో సమావేశమైన ఒపెక్  దేశాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చారిత్రక ఒప్పందంలో భాగంగా ప్రతిరోజు 10మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తి తగ్గించనున్నారు. 

 

 

ఈ నిర్ణయం వచ్చేనెల ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని కువైట్  చమురుశాఖ మంత్రి ఖలేద్  అల్ -ఫదేల్  తెలిపారు. అంటే మళ్లీ చమురు ధరలు పెరుగుతాయన్నమాట. చమురు ధరలు తగ్గినప్పుడే ధరలు తగ్గించని మన ప్రభుత్వాలు.. మరోసారి చమురు ధరలు పెరిగితే మాత్రం బాదేస్తాయనడంలో సందేహం లేదు. ఎనీ డౌట్స్

మరింత సమాచారం తెలుసుకోండి: