కరోనా వైరస్ నియంత్రణకై ప్రపంచ దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.. ఆంతర్జాతీయ విమాన సర్వీసులు అన్ని కూడా నిలిపివేశారు. ఇంకా అప్పటికి మొదలు.. పెట్రోల్, డీజిల్ ధరలు అసలు కదలడం లేదు.. ఎక్కడ ధర అక్కడే స్థిరంగా కొనసాగుతుంది. 

 

నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి.

 

అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు లాక్ డౌన్ ముగిసే వరుకు ఇలానే కొనసాగుతాయ్ అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏది ఏమైనా.. ఈ సంవత్సరం మొదలు నుండి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా కరోనా వైరస్ దెబ్బకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం.. తగ్గడం కాకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. lock down 

మరింత సమాచారం తెలుసుకోండి: