పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ ఏ.. ఎప్పుడు లేని విధంగా కరోనా కారణంగా భారీగా తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఆ తరవాత స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు అతి త్వరలోనే భారీగా పెరుగుతాయి అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

నిజానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో ఆశ్చర్యం లేదు.. ఒక్క పెట్రోల్, డీజిల్ ధరలే కాదు లాక్ డౌన్ తర్వాత ప్రతి వస్తువు ధర పెరగనుంది. 10 రూపాయిలు ఉన్న వస్తువు 11 లేదా 12 రూపాయిలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో ఆశ్చర్యం ఎం ఉంది. 

 

సాధారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు 15 పైసలు తగ్గితే మరుసటి రోజు కనీసం 10 పైసలు అయినా పెరుగుతుంది. ఇంకా అలాంటి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో ఆశ్చర్యం ఏమి లేదు.. ఇంకా గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: