కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ తప్ప ఇండియాకు వేరే మార్గం లేదు. అందుకే ఎంత నష్టం వచ్చినా లాక్‌ డౌన్ వేపే భారత్ మొగ్గింది. అసలే అరకొర వైద్య సౌకర్యాల కారణంగా మనకు లాక్ డౌన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ ఈ 21రోజుల లాక్ డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్లు నష్టపోయింది. 

 

 

 

ఈ 21రోజుల లాక్ డౌన్ తో 7 నుంచి 8 లక్షల కోట్లరూపాయల నష్టం వాటిల్లిందని ఆర్థిక నిపుణులు, పారిశ్రామిక వర్గాలు అంచనా వేశాయి. అత్యవసర సేవలు మినహా 70 శాతం ఆర్థిక కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజుకు దాదాపు 35 వేల కోట్లరూపాయలు నష్టాల్ని చవిచూడాల్సి వచ్చిందట. 

 

 

లాక్‌ డౌన్‌ కారణంగా రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ రంగాలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక్క రియల్ ఎస్టేట్ రంగంలోనే లక్ష కోట్లరూపాయలు నష్టం వాటిల్లిందట. మొదటి 15 రోజుల్లోనే 35 వేల 2 వందల కోట్ల నష్టాలు వచ్చాయట. ఇక లాక్‌ డౌన్ కారణంగా రిటైల్ రంగం 3 వేల కోట్లు నష్టపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: